పన్నుల్లో వాటా రూ.49 వేల కోట్లు

Feb 2,2024 11:36 #Rs.49 thousand crores, #taxes
  • గతేడాది కన్నా స్వల్పంగానే పెరుగుదల
  • కేంద్ర బడ్జెట్‌లో వెల్లడి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు రూ.49 వేల కోట్లు మాత్రమే రానున్నాయి. పన్నులు పెరుగుతున్నా, కేంద్రానికి ఆదాయం పెరుగుతున్నా కూడా ఆ పన్నుల్లో వాటా మాత్రం అతి స్వల్పంగా మాత్రమే పెరిగింది. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌లో ఈ విషయాన్ని పొందుపరిచారు.దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కేంద్రం వసూలు చేసే పన్నుల్లో అన్ని రాష్ట్రాలకు వాటా నిధులను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి 4.047 శాతం వాటా నిధులు ఇచ్చేందుకు తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మొత్తం ఎనిమిది రకాల పన్నులను కేంద్రం అన్ని రాష్ట్రాలకు అందిస్తుంది. ఈ క్రమంలోనే మొత్తం రూ.49,364.61 కోట్లను రాష్ట్రానికి కేటాయించింది. ఇది గతేడాదితో పోల్చితే కేవలం రూ.4,665 కోట్లు ఎక్కువగా ఉంది. కార్పొరేషన్‌ ట్యాక్స్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, కేంద్ర జిఎస్‌టి విభాగాల్లో కొంతవరకు పెరుగుదల కనిపించగా, కస్టమ్స్‌ పన్నులు బాగా తగ్గుతున్నాయి.

➡️