నెల్లూరులో భగ్గుమంటోన్న సూర్యుడు – ఖాళీగా రోడ్లు

Apr 15,2024 12:42 #Nellore District, #Summer

ప్రజాశక్తి-విడవలూరు (నెల్లూరు) : ఈ ఏడాది భానుడి ప్రతాపం భగభగమంటోంది. తీవ్రంగా కాస్తున్న ఎండలకు బయటకు రావాలంటే చిన్న పిల్లలు, ముసలివారు అల్లాడిపోతున్నారు. సోమవారం నెల్లూరులో ఎండ ఎక్కువకాయడంతో రోడ్లపై మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్మానుష్యంగా రోడ్లు కనబడుతున్నాయి. సుమారు 40 డిగ్రీలు ఎండ నమోదు అయినట్లు సమాచారం. కూలి నాలి చేసుకునే రోజువారి కూలీల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. భానుడి ప్రభావం రోజువారి కూలీల మీద పడిందనే చెప్పవచ్చు. రెక్కాడితే డొక్కాడే పరిస్థితుల్లో ఉన్న కూలీలు ఎంత ఎండ ఉన్నా పనులకు వెళ్లి బతకాల్సిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అది వారికే తెలుసు. భానుడి ప్రభావం ఇలాగే కొనసాగితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. కూలి పనులకు వెళ్లే కూలీలు, కార్మికులు పనులకు వెళ్లేందుకు ఇబ్బందులుపడుతున్నారు. పలు ఒంటి పూట బడులు జరుగుతుండడంతో విద్యార్థులు మరింత జాగ్రత్తలు తీసుకుంటూ నీరు ఎక్కువ తాగుతూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు.

➡️