టీటీడీ అటవీ కార్మికుల ది అలుపెరగని పోరాటం

Jan 28,2024 14:32 #ttd, #TTD forest workers
  •  సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె. సాంబశివరావు

ప్రజాశక్తి-తిరుపతి : సిఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు టీటీడీ అటవీ కార్మికులకు టైం స్కేల్ వర్తింపచేయాలని కోరుతూ 1159 రోజుల్లో గా కార్మికులు దీక్ష చేపట్టిన విషయం విధితమే. కార్మికులకు మద్దతుగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి చేపట్టిన నిరవాదిక దీక్షలకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె. సాంబశివరావు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఆదివారం దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన కార్మికుల ఉద్దేశించే మాట్లాడుతూ.. అటవీ కార్మికుల ది అలుపెరగని పోరాటం అన్నారు. అధికార పార్టీ నాయకులు కార్మికులను విడదీసి కొంతమందిని రెగ్యులర్ చేసి మరి కొంతమంది పై వివక్షత చూపడం సరైనది కాదన్నారు. మూడు సంవత్సరాలు పైగా కార్మికులు చేపట్టిన న్యాయమైన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు అందజేస్తున్నామని, టిటిడి వీరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కందారుపు మురళి, జి.బాలసుబ్రహ్మణ్యం, వందవాసి నాగరాజు, మల్లారపు నాగర్జున, సిపిఐ నాయకులు రామానాయుడు, మురళి, విశ్వనాథ్, ఇతర సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

 

➡️