పెద్దిరెడ్డి సుధీర్‌ రెడ్డి కుమారుడి వీడియో హల్‌చల్‌

ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : ముగ్గురు తాతలను ఒక్క పెద్ద నాన్నను గెలిపించాలంటూ … పెద్దిరెడ్డి సుధీర్‌ రెడ్డి కుమారుడి వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుంది. రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో తన ముగ్గురు తాతలను పెద్ద నాన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెద్దిరెడ్డి సుధీర్‌ రెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి వేదాంత రెడ్డి కోరే వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ముగ్గురు తాతలను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి పెదనాన్నను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వచ్చీరాని మాటలతో బుడతడు పలికిన మాటల వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది.

➡️