నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ‘మేమంతా సిద్ధం’

అనంతపురం : వైసిపి అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్‌ యాత్ర సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. యాత్రలో భాగంగా ఐదవ రోజు సోమవారం జగన్మోహన్‌ రెడ్డి బస చేసిన సంజీవపురం నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. బత్తలపల్లి, రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ ఎస్‌ పి కొట్టల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పివిఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు లో పాల్గంటారు. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్‌ ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు ముఖ్యమంత్రి చేరుకుంటారు.

➡️