శంకర్‌పల్లిలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Mar 4,2024 10:33 #suside, #Telangana

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35) ‘మనీ స్కీమ్‌’ పేరుతో చుట్టుపక్కల గ్రామాల్లోని వారితో డబ్బులు కట్టించాడు. ఈ స్కీమ్‌ ద్వారా రూ.వెయ్యికి రూ.3000, 58 రోజుల వ్యవధికి రూ.లక్షకు రూ.5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు కట్టించాడు. తీరా డబ్బులు ఇవ్వకపోవడంతో కట్టిన వారంతా అతడిని అడగడం మొదలు పెట్టారు. డబ్బులు ఇవ్వాలంటూ ఒక్కొక్కరుగా ఇంటికి రావడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ముగ్గురు పిల్లలను చంపేసి తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️