బోల్తాపడ్డ ట్రావెల్స్‌ బస్సు – డ్రైవర్‌ మృతి – 10మందికి తీవ్రగాయాలు

తిరుపతి సిటీ : ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్‌ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో 45వ జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని డ్రైవర్‌ శీను మృతి చెందగా, 10మంది ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ నుండి చెన్నైకు వెళుతున్న స్లీపర్‌ కోచ్‌ బస్సు రోడ్డు డివైడర్‌ ను ఢీకొని కావలి వైపు వెళుతున్న లారీని ఢీకొట్టి బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులోని 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️