21న ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభ

Jan 18,2024 12:07 #books, #KS Laxmanrao, #PDF MLC
vbs mandalilo mastaru book release program

ప్రజాశక్తి-గుంటూరు : శాసనమండలిలో 16 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రమణ్యం చేసిన ప్రసంగాలను సంకలనంగా చేసి, ఈ నెల 21న గుంటూరులో పుస్తకావిష్కరణ చేయనున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలియజేశారు. పుస్తకావిష్కరణ సభకు సంబంధించిన కరపత్రాలను గురువారం గుంటూరు యుటిఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు ఆవిష్కరించారు. బాలసుబ్రమణ్యం రైతులు కార్మికులు నిరుద్యోగులు మహిళలు వివిధ వర్గాల సమస్యలపై బాలసుబ్రమణ్యం సమగ్రమైన సమాచారంతో మండలిలో ప్రసంగించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఆయా ప్రసంగాలను ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో పుస్తకంగా రూపొందించినట్లు చెప్పారు. 21న జరిగే పుస్తకావిష్కరణ సభకు శాసనమండలి చైర్మన్ కే మోషన్ రాజు, ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ , యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.

➡️