వివేకా హత్య కేసు – అఫ్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తల దాడి

కడప : వివేకా హత్య కేసుకు సంబంధించి అఫ్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం దస్తగిరి తండ్రి హాజీవలి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో … నిన్న రాత్రి హాజీవలి శివరాత్రి జాగరణకు వెళ్లారు. దీంతో నామాలగుండు వద్ద వైసిపి కార్యకర్తలు దస్తగిరి తండ్రిపై దాడి చేశారు. జగన్‌పై దస్తగిరి పోటీ చేసే అంత మొనగాడా ? అంటూ దాడి చేశారు. కాసేపట్లో ఈ ఘటనపై దస్తగిరి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది.

➡️