మాకింకా తాయిలాలు అందలేదు : రోడ్కెక్కి ఓటర్ల ఆందోళన

May 12,2024 10:49 #Kakinada, #Protest, #voters

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : గ్రామ సమస్యలపైన, భూములు కోల్పోతున్నాము అని రోడ్డెక్కి ధర్నాలు చేసిన సంఘటనలు చూశాం కానీ ఎన్నికల వేళ తాయిలాలు అందలేదని మహిళలు, యువకులు రోడ్డెక్కి ధర్నా చేసిన సంఘటన కొండవరం గ్రామంలో ఆదివారం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో ఒక ప్రధాన పార్టీ పంపిణీ చేస్తున్న 3,000 రూపాయలు అందలేదన్న కారణంగా పిఠాపురం, ఉప్పాడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అటుగా వెళ్లిన ప్రయాణికులు విషయం తెలుసుకొని ఓట్లు కోసం డబ్బులు ఇవ్వలేదని విషయంపై ధర్నా చేయడం ఏమిటని అవాకయ్యరు. ప్రధాన పార్టీలు వైసిపి, జనసేన డబ్బులు పంపిణీ చేయడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోలేదు. దీంతో యథేచ్ఛగా ఇరువురు పార్టీలు డబ్బులు పంపిణీ చేసినప్పటికీ చర్యలు తీసుకోవలసిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

➡️