పింఛన్ల కోసం సచివాలయానికి కాలినడక 

మధ్యాహ్నాం అయిన అందని పింఛన్ల 

ప్రజాశక్తి-అరకులోయ రూరల్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో నేటి నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతాయని అధికారులు ఆదేశాల మేరకు జారీ చేశారు. అరకువేలి మండలం లోతేరు పంచాయితీ పరిధి తోటవలస, వివిధ గ్రామనికి చెందిన పింఛన్ల దారులు మూడు, నాలుగు కిలోమీటర్లు దూరంలో పింఛన్లు ఇస్తారని భావించి వృద్ధులు,వికలాంగులు లోతేరు గ్రామ సచివాలయం వద్ద కు కాలినడన చేరుకున్నారు. అయితే సచివాలయ సిబ్బందికి డబ్బులు అందలేదని వారు బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుని రావడానికి వెళ్లారని మధ్యాహ్నం తర్వాత అంటూ
మధ్యాహ్నం తర్వాత రావాలంటూ కొన్ని సచివాలయాల్లో సిబ్బంది చెపుతున్నారు.దీంతో అక్కడకు వచ్చిన వృద్ధులు, వికలాంగులు తిరిగి ఇంటికి వెళ్లలేక, ఎండకు మళ్లీ రాలేక అవస్థలు పడుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటికి తెచ్చి ఇచ్చే పింఛన్ ఎన్నికల కమిషన్ నిబంధనల ఆదేశాలతో వాలంటీర్ల చేత పంపిణీని నిలిపేశారు. దీంతో సచివాలయంలో పింఛన్ల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. సచివాలయ సిబ్బంది సరైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో పెన్షన్ ఇస్తారని ఆశతో వచ్చినట్లు వృద్ధులు వికలాంగులు చెబుతున్నారు. ఇంటి వద్దనే ప్రతి గ్రామంలో సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

➡️