ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం

May 6,2024 08:00 #2024 elections, #chandrababau, #TDP
  •  కాగజ్‌నగర్‌సభలో అమిత్‌ షా
  •  రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం
  • ధర్మవరం సభలో హామీ

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో, అనంతపురం ప్రతినిధి : ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేసి వాటిని ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు కేటాయిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. త్రిపుల్‌ తలాక్‌ రద్దుతో ముస్లిం సోదరీమణులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పదికిపైగా ఎంపి స్థానాలు, కేంద్రంలో 400 స్థానాలు బిజెపి దక్కించుకోవడం ఖాయమని, మూడోసారీ మోడీ సర్కార్‌ ఏర్పాటు కాబోతోందని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ బిజెపి ఎంపి అభ్యర్థి గొడం నగేష్‌కు మద్దతుగా ఆదివారం కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన జనసభలో అమిత్‌ షా మాట్లాడారు. తెలంగాణలో బిజెపి క్రమక్రమంగా తమ ఓటుశాతాన్ని పెంచుకుంటూ వస్తోందని, విజయం సాధించనున్న పదిస్థానాల్లో ఆదిలాబాద్‌ ఎంపి స్థానం ఉంటుందన్నారు.
పోలవరాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని, రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా అన్నారు. వైసిపి వల్లే పోలవరం నిర్మాణంలో తీరని జాప్యం జరిగిందని విమర్శించారు. ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.13.50 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను కూడా వైసిపి అమలు చేయలేదన్నారు. రాయలసీమకు సాగునీటిని అందించే హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు ప్రాంతాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో ఈ రెండు అంశాలను ప్రస్తావించిన ఆయన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అంశాన్నిగానీ, ప్రత్యేక హోదా అంశాన్నిగానీ మిగతా 2లో

➡️