స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటాం

Mar 14,2024 22:41 #Dharna, #visaka, #visaka steel plant
  • విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, బి.అప్పారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1127వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తోందని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ వంటి పరిశ్రమలు ప్రయివేటుపరమైతే రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని, యువత ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర మణిమకుటమైన విశాఖ ఉక్కును కాపాడతామని అన్ని పార్టీలూ వాటి మేనిఫెస్టోలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

➡️