వైసిపి హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం : లోకేశ్‌

Mar 18,2024 11:08 #Nara Lokesh, #speech, #YCP

మంగళగిరి (గుంటూరు) : వైసిపి హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. మంగళగిరి ఎల్‌ఈపీఎల్‌ అపార్టుమెంట్‌ వాసులతో సోమవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ … అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు చేపడతామన్నారు. మంగళగిరిలోని స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెజ్‌ తీసుకొస్తామని తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు తరలివచ్చిన ప్రతిఒక్కరికీ టిడిపి అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సమష్టిగా ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడిందని చెప్పారు. కలిసికట్టుగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేడు పదో తరగతి పరీక్షల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు చంద్రబాబు, లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

➡️