తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

May 8,2024 10:50 #heavy rains, #hydrabad

హైదరాబాద్‌ : తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇరు రాష్ట్రాలలో దట్టమైన మబ్బులు, ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాలకు భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది. ఇవాళ, రేపు వేర్వేరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో ఎవరూ చెట్ల కిందకు వెళ్లవద్దని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలను తాగవద్దని హెచ్చరించింది. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే 100కి డయల్‌ చేయాలని కోరింది.

➡️