ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు.. : రేవంత్‌ రెడ్డి

  • స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ పాలనలో మీ అవస్థలు, మీకు జరిగిన అవమానాలు తెలుసునని చెప్పారు. ఈమేరకు పదేళ్ల కేసిఆర్‌ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితిపై వారికి రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. ”జడ్పీటీసీగా చేసిన నాకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసు. ప్రభుత్వ పాలనకు స్థానిక ప్రజాప్రతినిధులే పునాదులు. నిర్ణయాధికారం, నిధులు రాక మీరు పడిన బాధలు తెలుసు. నిధులు రాకుంటే ఆస్తులు, బంగారం అమ్మి పనులు చేశారు. అప్పులకు వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు ఉపాధిహామీ కూలీలు, వాచ్‌మెన్‌లుగా పని చేస్తున్నారు. కేసీఆర్‌ మిమ్మల్ని పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. రేపు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవం పెంచే బాధ్యత కాంగ్రెస్‌దే. భారాస, కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడుదాం” అని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

➡️