మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవు..!

Apr 29,2024 10:39 #12, #banks, #holidays, #month of May

అమరావతి : దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన కస్టమర్లకు ముందుగానే అలర్ట్‌ కావల్సి ఉంది.

మే నెలలో బ్యాంకులకు ఇచ్చిన సెలవులు…

మే 1: మహారాష్ట్ర దినోత్సవం-మే డే (కార్మిక దినోత్సవం)
మే 5: ఆదివారం.
మే 8: రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకుల బంద్‌
మే 10: బసవ జయంతి-అక్షయ తృతీయ
మే 11: రెండో శనివారం
మే 12: ఆదివారం.
మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు
మే 19: ఆదివారం.
మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్‌, ముంబైలో బ్యాంకుల మూతపడతాయి
మే 23: బుద్ధ పూర్ణిమ
మే 25: నాలుగో శనివారం.
మే 26: ఆదివారం.

➡️