బ్లూస్టార్‌ నుంచి కొత్త డీప్‌ ఫ్రీజర్ల శ్రేణీ

హైదరాబాద్‌ : ప్రముఖ ఎసి ఉత్పత్తుల కంపెనీ బ్లూస్టార్‌ వివిధ వర్గాల అవసరాలను తీర్చేలా విద్యుత్‌ ఆదా చేసే సరికొత్త డీప్‌ ప్రీజర్ల శ్రేణీని విడుదల చేసింది. 60 నుంచి 600 లీటర్ల సామర్థ్యం గల వివిధ మోడళ్లను గురువారం హైదరాబాద్‌లో బ్లూస్టార్‌ ఎండి బి త్యాగరాజన్‌ ఆవిష్కరించారు. వీటి ధరలు రూ.16వేల నుంచి ప్రారంభమవుతాయన్నారు. అహ్మాదాబాద్‌, వాడా ప్లాంట్లలో లేటెస్ట్‌ ఆటోమేషన్‌ టెక్నలాజీతో వీటిని తయారు చేశామన్నారు. రాబోయే రోజుల్లో వాణిజ్య రిఫ్రిజరేషన్‌, కోల్డ్‌ చెయిన్‌ సొల్యూషన్స్‌ భారీగా వృద్థి చెందనున్నాయన్నారు.

➡️