తెలంగాణలో చికెన్‌ వ్యాపారులు డీలా..!

May 20,2024 11:57 #Chicken traders, #Telangana

తెలంగాణ : ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా … కోళ్ల వ్యాపారం బాగా దెబ్బతింది. ముఖ్యంగా తెలంగాణలో కోడి ధర అమాంతం పెరిగింది. చికెన్‌ కొనాలంటేనే మాంసాహారులు బెంబేలెత్తిపోతున్నారు. గత వారం కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ ధర రూ.250 నుంచి రూ.280 మధ్యలో ఉంది. ఇప్పుడు అది ఏకంగా రూ. 300కు చేరుకుంది. మరో 15 రోజులపాటు చికెన్‌ ధర ఇలాగే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిందని… కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని, జూన్‌ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు తెలిపారు. పెరిగిన చికెన్‌ ధరలతో రీటైల్‌ చికెన్‌ అమ్మకాలు భారీగా పడిపోయాయి. వినియోగదారులు చికెన్‌ షాపులకు వెళ్లడాన్ని తగ్గించేశారు. బిజినెస్‌ తగ్గడంతో చికెన్‌ రీటైల్‌ వ్యాపారులు కూడా డీలా పడిపోతున్నారు. మొన్నటి వరకు రోజుకు 20 కిలోల చికెన్‌ అమ్మేవారిమని… ఇప్పుడు 10 కిలోలు మాత్రమే సేల్‌ అవుతోందని ఒక వ్యాపారి వాపోయారు.

➡️