నేటి నుంచి ఎనర్జీ మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూ

May 8,2024 21:20 #Business

అహ్మాదాబాద్‌ : ఎనర్జీ మిషన్‌ మెషినరీస్‌ (ఇండియా) లిమిటెడ్‌ రూ.41.15 కోట్ల నిధులు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం మే 9నుంచి పబ్లిక్‌ ఇష్యూను తెరుస్తున్నట్లు తెలిపింది. ఈ ఇష్యూ 13తో ముగియనుందని పేర్కొంది. ఈ నిధులను గుజరాత్‌లోని సనంద్‌లో ప్రస్తుతం ఉన్న తయారీ యూనిట్‌లో సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌ పనులు, కొత్త ప్లాంట్‌ అండ్‌ మెషినరీలతో సహా కంపెనీ విస్తరణ ప్రణాళికలకు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. ఇష్యూ ధరల శ్రేణీ రూ.131 నుంచి రూ.138గా నిర్ణయించింది. ఇందుకోసం రూ.10 ముఖ విలువ కలిగిన 29.82 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.

➡️