మార్కెట్లోకి టాటా మూడు కొత్త వాహనాలు

Dec 6,2023 09:01 #Business, #tata
  • తేలికపాటి వాణిజ్య ట్రక్కుల విడుదల

ముంబయి : దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ మార్కెట్లోకి కొత్తగా మూడు చిన్న తేలికపాటి వాణిజ్య వాహనాలు (ఎస్‌సివి)లను విడుదల చేసింది. మంగళవారం ఆవిష్కరించిన వాటిలో ఇంట్రా వి70 పికప్‌, ఇంట్రా వి20 గోల్డ్‌ పికప్‌, ఎస్‌ హెచ్‌టిం మోడళ్లు ఉన్నాయి. ఈ కొత్త వాహనాలు మెరుగైన ఆదాలతో ఎక్కువ దూరాలకు ఎక్కువ పేలోడ్‌లను మోసుకెళ్లేలా రూపొందించబడ్డాయని టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఈ పికప్‌ వాహనాలు వివిధ రకాల వినియోగాల కోసం ఉపయోగించుకోవచ్చని టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీష్‌ వాఫ్‌ు పేర్కొన్నారు. ఇంట్రా వి20 మోడల్‌ 1200 కిలోలు, వి70 పికప్‌ 1700 కిలోల సరుకు పికప్‌ సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. కాగా.. వీటి ధరలను వెల్లడించలేదు.

➡️