అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ

Dec 8,2023 13:51 #chairman, #Konaseema, #speech

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , రైతులెవరు అధైర్యపడవద్దని కే.గంగవరం మండలం వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ తెలిపారు. కే.గంగవరం మండలంలోని పలు ధాన్యం రాశులను శుక్రవారం పరిశీలించారు.

ప్రస్తుతం అవరోధంగా ఉన్న జిపిఎస్‌ విధానాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని రైతులంతా ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించుకోవచ్చని సూచించారు. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చొరవతో జిపిఎస్‌ విధానాన్ని నిలిపివేశారని దీని ద్వారా ధాన్యం వేగంగా మిల్లులకు చేరే అవకాశం ఉందని దీని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.1700 టన్నులు ధాన్యం ఎగుమతిమండలంలో గురు, శుక్రవారాల్లో 1700 టన్నులు ధాన్యం ఎగుమతి అయిందని మండల వ్యవసాయ అధికారి బలుసు రవి తెలిపారు. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం జిపిఎస్‌ విధానం నిలిపేయడంతో రైతులకు ధాన్యం సులువుగా ఎగుమతులు చేసుకునే వీలుందన్నారు. ఏదైనా టెక్నికల్‌ ప్రాబ్లం ఎదురైనప్పుడు ఆర్‌బికె సెంటర్‌ మిల్లుల దగ్గర కస్టోడియల్‌ అధికారికి రైతులు తెలియజేయాలన్నారు. ఇబ్బందులు ఏర్పడిన రైతులు విషయాన్నీ తెలియజేస్తే వారికి వివరాలు ప్రకారం ఆన్‌లైన్‌ చేయడం సులువు అవుతుందని వివరించారు. ఈ రెండు రోజుల్లోనూ ఎగమతులు భారీగా పెరిగినట్లు వ్యవసాయ అధికారి వివరించారు. అన్ని రకాల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు.

➡️