అమ్మోరు రూపంలో అంగన్వాడీల వినూత్న నిరసన

Jan 4,2024 16:17 #Anganwadi strike, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని, తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని,గ్రాట్యుటీ చెల్లించాలని పలు డిమాండ్లతో కూడిన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 24వ రోజుకి చేరుకుంది. సమ్మెలో భాగంగా స్థానిక కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన సమ్మె శిబిరంలో అమ్మోరు వేషధారణలతో వేప జంటలు పట్టుకొని అమ్మోరు లా ఊగుతూ జగన్మోహన్‌ రెడ్డికి మంచి బుద్ది ఇవ్వాలని, మా వేతనాలు పెంచాలని అమ్మోరును అంగన్వాడీలు కోరినట్లు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హేల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు,నాయకులు రాధ, ఉష, సుశీల తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఇచ్చిన బెదిరింపులకు పాల్పడిన బెదిరేది లేదని మా వేతనాలు పెంచే వరకు,సమస్యలు పరిష్కారం చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు అన్నారు.అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

➡️