అర్హులందరికీ ప్రభుత్వ లబ్ధి

పథకాల బోర్డును

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలోని పలు మండలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమం జరిగింది. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, వైసిసి నాయకులు పాల్గొన్నారు. తాళ్ళరేవు అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని ఇఒపిఆర్‌డి మల్లాడి భైరవమూర్తి అన్నారు. గురువారం చొల్లంగిలో వైసిపి నాయకుడు బూరెల వెంకటరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చొల్లంగి గ్రామంలో వివిధ పథకాల ద్వారా డిబిటి, నాన్‌ డిబిటి. ద్వారా రూ. 23.72 కోట్లను లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. మండల సచివాలయాల కన్వీనర్‌ దున్న శ్రీకాంత్‌ పథకాల ప్రదర్శన బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాసరావు, వరిపల్లి శివాజీ గణేష్‌, మాసా శ్రీనివాస్‌, ఎమ్‌.శ్రీనివాస్‌, మేడిశెట్టి నూకరాజు, వార సూర్యకుమారి, దడాల ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ స్థానిక 12, 13, 25, 26 వార్డుల్లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్‌ ఛైర్మన్‌ ఊబా జాన్‌ మోసెస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రతీ వార్డులో రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకూ లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల సచివాలయాల వద్ద వైసిపి .జెండాలు, సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాల శ్రీనివాసు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సచివాలయాల ఇన్‌ఛార్జ్‌ ఇరుసుమల్ల సాయి, పార్టీ నాయకులు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.పెద్దాపురం వైసిపి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసి మంగతాయారు, జడ్‌పిటిసి గవరసాన సూరిబాబు అన్నారు. పట్టణ పరిధిలోని 9వ సచివాలయం వద్ద, మండల పరిధిలోని కొండపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద వై ఎపి నీడ్‌ జగన్‌ కార్యక్రమం గురువారం జరిగాయి. ఈ కార్యక్రమాలు మున్సిపల్‌ మేనేజర్‌ జ్యోతి రాణి, కొండపల్లి సర్పంచ్‌ కొత్త చక్ర రావుల అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాల బోర్డులను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అగ్రో డైరెక్టర్‌ సయ్యద్‌ జానీ, గృహ సారధుల మండల కన్వీనర్‌ గోపు మురళి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కనకాల మహాలక్ష్మి, కొండపల్లి ఎంపిటిసి పోకనాటి నాగలక్ష్మి, మున్సిపల్‌ కౌన్సిలర్లు సత్యభాష్కరరావు, విడదాసరి రాజా, కో ఆప్షన్‌ సభ్యులు వాసంశెట్టి గంగ, షేక్‌ రఫీ, వైసీపీ పట్టణ అధ్యక్షులు కాపుగంటి కామేశ్వరరావు, తలారి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️