ఇవిఎం అవగాహన కేంద్రాలు ప్రారంభం

అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఇవిఎంను పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఇవిఎం) వినియోగంపై అవగాహన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కేంద్రాలను ప్రారంభించినట్టు కలెక్టర్‌ తెలిపారు. ఇవిఎం డెమోనుస్ట్రేషన్‌ సెంటర్లను ఎవరైనా సందర్శించి ఓటు వేసి తాము ఏ గుర్తుకు వేశామో అదే రీతిలో నమోదు అవుతుందో లేదో తెలుసుకోవచ్చునని అన్నారు. వివిప్యాట్‌ స్లిప్‌లు సంబంధిత యంత్రంలో పడతాయని, ఏ గుర్తుపై బటన్‌ నొక్కితే ఆ గుర్తుకు ఓటు పడింది లేనిది డిస్‌ప్లే ద్వారా తెలుసుకోవచ్చ చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు అన్ని నియోజకవర్గాల్లో పని చేస్తాయని తెలిపారు.

➡️