ఎన్నికల ఫిర్యాదుల పరిష్కార కేంద్రం పనితీరు పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

Mar 19,2024 17:54 #collector, #Krishna district, #Visit

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలో డీఈవో కార్యాలయ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పరిష్కార కేంద్రం మంగళవారం సందర్శించారు. ఎన్నికలకు సంబంధించి అందిన ఫిర్యాదులు వాటిని పరిష్కరించిన తీరు పరిశీలించారు. ఈ విభాగంలో 24X7 కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 08672-252533, 1950 ఏర్పాటు చేయగా, సి విజిల్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన ఎన్నికల ఫిర్యాదులు, ఈసీ నిబంధనల మేరకు వాటిని పరిష్కరించిన తీరు కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.ఫిర్యాదులు వచ్చినప్పుడు హార్డ్ కాపీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ప్రతి ఫిర్యాదుకు సంబంధించి పరిష్కరించిన ఫైలు భద్రపరచాలని కలెక్టర్ నోడల్ అధికారికి సూచించారు.అనంతరం కలెక్టరేట్ లోని ఎంసీఎంసీ విభాగాన్ని కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించారు టీవీలు, వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో రాజకీయ ప్రచార ప్రకటనలు, చెల్లింపు వార్తలు ఎలా గమనిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డిఆర్వో కె. చంద్రశేఖర రావు, డీఎస్పీలు, ఎన్నికల ఫిర్యాదుల విభాగం నోడల్ అధికారి జే.జ్యోతి, మీడియా నోడల్ అధికారి ఎం.వెంకటేశ్వర ప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి కిషోర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

➡️