కొనసాగుతున్న అంగన్వాడీ రిలే నిరాహారదీక్షలు

Jan 7,2024 14:58 #anaganwadi, #vijayanagaram
  • మద్దతు తెలిపిన ప్రజాసంఘాలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కు కనీస వేతనాలు చెల్లించాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 27 వ రోజుకి చేరుకుంది.సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండవ రోజు కి చేరుకున్నాయి.దీక్షలకు పలు ప్రజా సంఘాలు నాయకులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. దీక్షలను ఉద్దేశించి ఇన్సూరెన్స్ యూనియన్ నాయకులు ఎం.శ్రీనివాస మాట్లాడుతూ ఎస్మా పొరతాలు చేసే వారికి కొత్త కాదన్నారు. కేవలం ప్రజా గొంతుకను,ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు తీసుకొచ్చిన చట్టం తప్ప మరొకటి కాదన్నారు.న్యాయమైన డిమాండ్ లు పరిష్కారం కోసం,ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతుంటే సమస్యలను పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా మరింత ఉధృతం గా ఉద్యమం సాగించే విధంగా ఎస్మా తీసుకొని రావడం అన్యాయమన్నారు. నియంత పాలనకు నిదర్శనమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేసి సమ్మెను విరమింప చేయాలని లేదంటే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని,ఇటువంటి బెదిరింపులకు కార్మిక వర్గం బయపడధని అంగన్వాడీ లకు అండగా ఎస్మా కు వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలు,ఉద్యోగ సంఘాల అండగా ఉంటామన్నారు.అనంతరం దీక్షలను ఉద్దేశించి పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, సి ఐ టి యు నాయకులు బి రమణ, ఎపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్సు యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️