గీతం విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు

గీతంలో 'మేకర్స్‌ స్పేస్‌'

ప్రజాశక్తి- మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ లోని ఇంజనీరింగ్‌ విద్యార్ధుల నూతన ఆవిష్కరణలను ‘మేకర్స్‌ స్పేస్‌’ పేరిట గురువారం ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. గీతం వెంచర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కోచ్‌ బి.రాజ్‌కుమార్‌ మార్గదర్శకంలో వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల విద్యార్ధులు తమ ఆలోచనలకు ఆవిష్కరణల రూపం ఇచ్చారు. స్మార్ట్‌ హెల్మెట్‌, రోబోఐ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సెక్యూరిటీ సిస్టమ్‌ వంటివి ప్రదర్శనగా ఉంచారు. గీతం ప్రోవైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌లు ప్రొఫెసర్‌ సి.విజయశేఖర్‌, ప్రొఫెసర్‌ రామశాస్త్రీ, డైరక్టర్‌ ప్రొఫెసర్‌ నాగేంద్రప్రసాద్‌ తదితరులు విద్యార్ధులను అభినందించారు. ఈ సందర్భంగా గీతం ప్రోవైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు మాట్లాడుతూ విద్యార్ధులలో స్టార్టప్‌ ఆలోచనలను ప్రోత్సహించడానికి గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వెంచర్‌ డవలప్‌మెంట్‌ సెంటర్‌ (విడిసి) ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. విద్యార్ధులు ప్రభుత్వం, పలు పారిశ్రామిక సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహలను సద్వినియోగం చేసుకుని స్టార్టప్‌ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.

గీతంలో ‘మేకర్స్‌ స్పేస్‌’ ప్రదర్శన

➡️