నివాసయోగ్యమైన స్థలాలు ఇప్పించాలి

జగనన్న కాలనీ

ప్రజాశక్తి-గోపాలపురంజగనన్న లేఅవుట్ల భూమి నివాస యోగ్యం కాదని ఆ భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేమని లబ్ధిదారులు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.భాను ప్రకాష్‌ రెడ్డికి తెలిపారు. గురువారం గోపాలపురంలో శివారులోని జగనన్న కాలనీలకు సేకరించిన ప్రదేశాన్ని స్పెషల్‌ డిప్యూటి కలెక్టర్‌ ఎం.భానుప్రకాష్‌ రెడ్డి పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశ ఏర్పాటు చేశారు. వడ్లవాని చెరువు వద్ద జగనన్న లేఔట్‌ óూమిలో 168 మంది లబ్ధిదారులకు ఇచ్చిన స్థలం నిర్మాణాలకు అనుకూలంగా లేవని అందువల్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నట్టు లబ్ధిదారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రెండుసార్లు లబ్దిదారుల అభ్యర్ధన మేరకు స్థలంలో మైనింగ్‌ జూవాలజీ అధికారులతో పరిశీలించామన్నారు. వారి నివేదిక ఆధారంగా ఇంటినిర్మాణాలకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. అందువల్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరలో ఇంటి నిర్మాణాలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. దీనిపై లబ్ధిదారులు మాట్లాడుతూ ఈ భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టమని డిప్యూటీ తెలిపారు. నివాసయోగ్యమైన భూమి ఇప్పించాలంటూ కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి 60 మంది వచ్చారని మిగలవారితో సచివాలయం సిబ్బంది లబ్ధిదారులు వద్దకు వెళ్లి అభిప్రాయ సేకరణ తీసుకుని కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని తెలిపారు. జగనన్న కాలనీసమస్యలు వింటున్న స్పెషల్‌ డిప్యూటి కలెక్టర్‌

➡️