పతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్‌

Mar 21,2024 17:04 #2024 elections, #collector, #Kurnool, #raly

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు): ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకొవలని కలెక్టర్‌ డా జి.సృజన పేర్కొన్నారు. గురువారం ఆదోని మున్సిపల్‌ గ్రౌండ్‌ నుండి బీమా సర్కిల్‌ వరకు స్వీప్‌ ఓటు హక్కు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలిని జిల్లా ఎస్‌పి కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్‌ సృజన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరుపున ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓటు యొక్క ప్రాముఖ్యతను ఆదోని ప్రజలందరికీ తెలియచేయడమే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆదోని పట్టణ వాసులందరూ కూడా వారి బాధ్యతగా మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోని భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా ప్రజాస్వామ్యానికి సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ కష్ణకాంత్‌ మాట్లాడుతూ మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయన్నారు. ప్రజలందరూ కూడా ఇతరులు ఎవ్వరికీ భయపడకుండా స్వేచ్ఛగా వారి ఓట్‌ హక్కును వినియోగించుకోవాలని కోరారు. భద్రత పరంగా తీసుకోవాల్సిన అని జాగ్రత్తలను తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ,ఆదోని డిఎస్పీ శివ్‌ నారాయణ్‌ స్వామి, ఆదోని తహశీల్దార్‌ హసీనా సుల్తానా, ఆదోని మునిసిపల్‌ కమిషనర్‌ రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️