పరిశోధన రంగంలో ఉన్నతంగా రాణించాలి

Nov 23,2023 22:34
డాక్టర్‌ అనితను

ప్రజాశక్తి – కాకినాడ మారుతున్న సాంకే తికతకు అనుగుణంగా పరిశోధన రంగంలో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని ఆదిత్య డిగ్రీ మరియు పిజీ కళాశాలల అకాడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఇవిఎల్‌ నాయుడు సూచించారు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎంఎస్‌సి ఆర్గానిక్‌ కెమిస్త్రీ విద్యార్థులకు ఎస్సెమెట్రిక్‌ సంశ్లేషణ పద్ధతులు అంశంపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠణాభిలాషి, పరిశోధన దృష్టిని పెంపొందించేందుకు ఈ అవగాహన సదస్సు ఎంతగానో దోహదం చేస్తాదన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశోధన రంగంపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఎఎస్‌డి మహిళా కళాశాల రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ కె.అనిత మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధన దృష్టితో చదివి, సబ్జెక్టుపై పట్టు సాధించాలని అన్నారు. ఎస్సెమెట్రిక్‌ సంశ్లేషణ పద్ధతులను, సూత్రాలను మరియు ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నాయుడు ముఖ్యఅతిథిని సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కెమిస్ట్రీ విభాగాధిపతి కె.సురేష్‌ కుమార్‌ను ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ మరియు పీజీ కళాశాలల సెక్రటరీ డాక్టర్‌ నల్లమిల్లి సుగుణా రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, క్యాంపస్‌ ఇన్‌ఛార్జ్‌ మూర్తి, కెమిస్ట్రీ అధ్యాపకులు వి.సోమేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.డాక్టర్‌ అనితను సత్కరిస్తున్న ఆదిత్య కళాశాల డైరెక్టర్‌ నాయుడు, తదితరులు

➡️