మల్బరీ సాగుతో ప్రయోజనం

ప్రజాశక్తి – కడపప్రతినిధి మల్చరీ సాగుతో అధిక ప్రయోజనం చేకూరుతుంది. కుటీర పరిశ్రమ తర హాలో సాగు చేస్తే మరింత ఆదాయం లభిస్తుంది. దీనికి సమర్థ యాజమాన్య పద్ధతులను జోడించాలి. దీనికితోడు ఇటీవలి నూతన రకపు వంగడాలతో పంట లను సాగు చేసుకోవాలి. ఆధునిక మార్కెటింగ్‌ సదు పాయం కారణంగా గణ నీయంగా ఆదాయం లభి స్తోంది. సరుకును తూకం వేసిన వెంటనే పేమెంట్‌ చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటైంది. స్పల్పకాలిక పంటల తరహాలో 45 రోజు నుంచి 70 రోజుల వ్యవధిలో ఆదాయం లభిస్తోంది. తెగుళ్లు సోకే అవకాశం ఉండ దు. వాణిజ్య పంటల తరహాలో లక్షలాది రూపాయల్లో పెట్టు బడులు పెట్టి నష్ట పోయే అవకాశం ఉండదని పేర్కొంటున్న కడప పట్టు పరిశ్రమలశాఖ ఎడి అన్న పురెడ్డి శ్రీనివాసులరెడ్డితో ప్రజాశక్తి ముఖాముఖి…మల్బరీ వివరాలు తెలపండి ? జిల్లాలో 400 ఎకరాల్లో మల్బరీ సాగులో చేయాల్సి ఉంది. 2022 -23 ఆర్థిక సంవత్సర చివరి నాటికి 250 ఎకరాల లక్ష్యానికిగానూ 222 ఎకరాల్లో సాగు చేయడమైంది. దీంతో 89.15 శాతం లక్ష్యాన్ని అందుకోవడమైంది. జిల్లావ్యాప్తంగా 340 మంది రైతులకు రూ.269 కోట్ల మేరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. మల్బరీ ఫామ్‌లెన్ని? రెండు మల్బరీ ఫామ్స్‌ ఉన్నాయి. మైదుకూరు నియోజకవర్గంలోని వనిపెంట, కడప నగర సమీపంలోని ఊటుకూరు ప్రాంతాల్లో పెంచుతున్నాం. ఒక్కో ఫారానికి రెండు లక్షల మల్బరీ నారు మొక్కలను పెంచి రైతులకు సరస మైన ధరలకు అందుబాటులో ఉంచుతున్నాం. రూ.2 చొప్పున నర్సరీ మొక్కలను అందజేస్తాం. వనిపెంటలో 25 వేల పత్తి గుడ్లను చాకీ కట్టి, ఎనిమిది రోజుల తర్వాత రైతులకు సరఫరా చేస్తాం. రూ.2,600 చొప్పున వసూలు చేసి వంద గుడ్లను అప్పగించడం జరుగుతోంది.ప్రోత్సాహకాల వివరాలు తెలపండి? ఎకరా నారు మొక్కలకు రూ.18,500 ఇస్తాం. షెడ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు, ఎస్‌సి, ఎస్‌టిలకు 3.60 లక్షలు కేటాయిస్తున్నాం. పరికరాలు, స్టాండు, ప్లాస్టిక్‌ తట్టలు, నేత్రికములు (చంద్రికలు) నిమిత్తం రూ.75, 000 మం జూరవుతుంది. ఇందులో ఎస్‌సి, ఎస్‌టిలకు 90 శాతం, ఓసి, బిసిలకు 75 శాతం సబ్సిడీ అందజేస్తాం. మల్బరీ విస్తరణ చర్యలేమిటి? ఊటుకూరు, వనిపెంట ప్రాంతాల్లో మల్బరీ సాగు పట్ల ఆర్‌కెఇవై పథకం కింద అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సబ్సిడీలు, సాగు లాభదాయకతను వివరిస్తాం. దీంతోపాటు వనిపెంటలో చాకీ పురుగుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అభ్యుదయ రైతులను ఆకర్షిస్తు న్నాం. ఫలితంగా మల్బరీ సాగు విస్తీర్ణాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం.గూళ్ల రకాలెన్ని, ఇన్‌సెంటివ్స్‌ వివరాలు? బైఓల్టేన్‌లో డబుల్‌హైబ్రీడ్స్‌, సి.పి రకాలు. తెల్లగూళ్లు, ఏప్రిల్‌, మే, జూన్‌లో సాగు చేసుకోవచ్చు. సిపిగూళ్లు. తెల్లగూళ్లకు మార్కెట్లో కిలో రూ. 700, సిపి గూళ్లకు రూ.350 ఇన్‌సెంటివ్‌ కింద ఇచ్చే అవకాశం ఉంది. రైతులే గూళ్లను మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించుకోవాలి. గూళ్ల కొనుగోలు అనం తరం నగదును చెక్కుల రూపంలో అందజేస్తారు. మార్కెట్ల వివరాలు తెలపండి? మదనపల్లి, కదిరి, ధర్మవరం, పలమనేరు, హిందూపురం మార్కెట్లలో విక్ర యించుకునే అవకాశం ఉంది. కర్నాటకలో రాంనగర్‌, సిద్దలగట్ట మార్కె ట్లు అందుబాటులో ఉన్నాయి. సాగు సీజన్ల గురించి చెప్పండి? జూన్‌ నుంచి మార్చి వరకు మల్బరీని సాగు చేసుకోవచ్చు. సిబి రకం, బైవోల్ట్‌ రకం. సిబి రకం వేడి వాతావరణంలో సాగు చేసుకోవచ్చు. బైవోల్డ్‌ రకం వేసవిలో సాగు చేసుకోవాలి. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు బైవోల్డ్‌ సీడ్‌, మార్చి నుంచి జూన్‌ వరకు సిబి రకం రకాలను సాగు చేసు కోవాలి.మల్బరీ దశలను వివరించండి? నాలుగు జరాలు, ఐదు దశలు ఉంటాయి. గుడ్డు నుంచి పురుగు బయటికి వచ్చేది మొదటి దశ, మూడు రోజుల తర్వాత జరానికి పోవడం జరుగుతుంది. 24 రోజుల్లో పురుగు రూపంలో లార్వా దశ వస్తుంది. ఆరు నుంచి ఎనిమిది రోజుల తరువాత గూడు కట్టుకోవడాన్ని పీపా దశ అం టారు. ఐదవ రోజు మార్కెట్‌ పోవడం జరుగు తుంది. ఐదో రోజు మార్కె ట్‌ తీసుకెళ్లి ఇ-యాక్షన్‌ ద్వారా రీలర్స్‌కు విక్రయించాలి. రేటు ఇష్టం లేక పోతే సెకెండ్‌, థర్డ్‌ యాక్షన్స్‌కు వెళ్లొచ్చు. విక్రయ అనంతరం గంట తర్వా త రైతు ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. షెడ్ల ఏర్పాటు, సంరక్షణ ఎలా ? ఊరు బయట, పొలాల్లో షెడ్లు ఏర్పాటు చేయాలి. 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 35 అడుగుల పొడవు, 20 అడుగుల వెడ ల్పుతో షెడ్లు నిర్మించాల్సి ఉంది. యూనిట్‌ విలువ రూ.4 లక్షలు అయితే ఓసి, బిసిలకు 75 శాతం సబ్సిడీ, ఎస్‌సి, ఎస్‌టి 90 శాతం సబ్సిడీ ఇసా ్త రు. రూ.3.60 లక్షలు వస్తుంది. షెడ్ల అడుగు భాగంలో న్యూస్‌ పేపర్‌ పరి చి షూట్‌ ఫీడింగ్‌ (కొమ్మలు వేయడం) చేయాలి. నేత్రికలు, చాకీ కట్టెలు ఏర్పాటు చేయాలి. సున్నం కొట్టడంతో క్రిమి కీటకాదులు నశించి పోవ డంతో తెగులు అనేది ఉండదు. ఫలితంగా లేబర్‌ ఛార్జీ తగ్గుతుంది. కొమ్మ అధిక సమయం ఫ్రెష్‌గా ఉంటుంది. సాగు తీరుతెన్నుల గురించి తెలపండి? మొక్కల మధ్య మూడు నుంచి ఐదు అడుగుల వ్యత్యాసం ఉండాలి. గాలి పారడంతో ఆకులు పండుబడకుండా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా తోట ఆరోగ్య వంతంగా ఉంటుంది. జిల్లాలో కడప, బద్వేల్‌, పులివెందుల, మైదుకూరు ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది.పంట దశలను వివరించండి? మూడు నెలల పాటు నారు సాగు చేయాల్సి ఉంటుంది. నాలుగున్నర్ర నెలకు కోత దశకు చేరుకుంటుంది. ప్రతి 45 రోజులకోసారి పంట కోతకు వస్తుంది. ఈలెక్కన ఏడాదికి ఐదు నుంచి ఆరు పంటలు తీసే అవకాశం ఉంది. ఎకరా సాగుకు 250 నుంచి 300 గుళ్లు మేపవచ్చు. కోతకు రూ.70 వేల చొప్పున ఆరు కోతల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఈలెక్కన ఎకరా నికి రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

➡️