మూడో రోజుకు ఆశ వర్కర్స్‌ సమ్మె

శ వర్కర్లు,

ప్రజాశక్తి -దేవరపల్లి విధి నిర్వహణలో మరణించిన ఆశ వర్కర్‌ రమాదేవి కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రజాప్రతినిధులు అధికారులు విఫలమయ్యారని సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌ విమర్శించారు. దేవరపల్లి పిహెచ్‌సి వద్ద ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు. సిఐటియు మండల గౌరవాధ్యక్షురాలు మల్లెపూడి వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భగత్‌ మాట్లాడుతూ రమాదేవి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దిక్కుతోచని స్థితిలో కుటుంబికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లనే ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సమ్మెలో మరుపట్ల ఇందిర, ఆర్‌.స్వర్ణకుమారి, డి.మార్త, యు.సుజాత, వి.బుజ్జమ్మ, కె.పద్మ, సిఐటియు నాయకులు కె.రత్నాజీ, రైతు సంఘం నాయకులు పి.సత్యనారాయణ, కృష్ణారావు పాల్గొన్నారు.దీక్షలో పాల్గొన్న ఆశ వర్కర్లు, మాట్లాడుతున్న సిఐటియు నాయకుడు భగత్‌

➡️