రాజ్యాంగానికి లోబడి పని చేయాలి

Nov 26,2023 23:19
అంబేద్కర్‌ విగ్రహాం

ప్రజాశక్తి – యంత్రాంగం

జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, అంబేద్కర్‌ యువజన సంఘాలు, దళిత, ప్రజాసంఘాలు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం దేశంలోని అన్ని వ్యవస్థలు భారత రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఏడాది నవంబర్‌ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా, రాజ్యాంగ దినోత్సవంగా, వరకట్న వ్యతిరేక దినోత్సవాలని జరుపుకుంటున్నామని తెలిపారు. భారత దేశంలోని పౌరులు, పరిపాలన వ్యవస్థలు, రెవెన్యూ, న్యాయ వ్యవస్థలు, పోలీసు వ్యవస్థ, రాజ్యాంగ, రాజ్యాంగేతర సంస్థలు, కంపెనీలు దేశంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారం నడుచు కోవాలన్నారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి వై జంక్షన్‌ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌ఎస్‌ఎ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె. ప్రత్యూష కుమారి, కుటుంబ న్యాయస్థానం, 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్‌. మాధురి, కంట్రోలర్‌ ఎగ్జామ్స్‌ పి. బాబ్జీ, జోన్‌ 1,2 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (కాలేజీలు) డాక్టర్‌ చప్పిడి కృష్ణ, కాలేజీ ప్రిన్సిపల్‌ ఆర్‌కె. రామచంద్రరావు పాల్గొన్నారు. డిఇఒ కార్యాలయం వద్ద రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో డివైఇఒ ఇవిబిఎన్‌ నారాయణ, కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్లు వి.వెంకట్రాజు, ఛాయాదేవి, అర్బన్‌ రేంజ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ బి.దిలీప్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎస్‌కెఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.రాఘవ కుమారి, రాష్ట్ర జిలెన్స్‌ కమిటీ మెంబర్‌ గొట్టుముక్కల అనంతరావు, ఐక్యూఎసి కో-ఆర్డినేటర్‌ బి.అనురాధ కుమారి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎం.కాస్మ, కె.వీరలక్ష్మి, పి.శ్రీదేవి పాల్గొన్నారు. అలాగే రాజమహేంద్రవరం డివిజన్‌ ఎల్‌ఐసి కార్యాలయంతోపాటు, ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని ఎల్‌ఐసి కార్యాలయాల వద్ద రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో మార్కెటింగ్‌ మేనేజర్‌ కళ్యాణ్‌, యూనియన్‌ నాయకులు గుబ్బల రాంబాబు, కోదండరాం, సమ్మతం గన్నయ్య, రాజ్‌ కుమార్‌, పి ఆనంద్‌ కుమార్‌, అరవింద్‌, భాస్కర్‌, వెంకటేశ్వర్లు, రమణ పాల్గొన్నారు. కొవ్వూరు రూరల్‌ స్థానిక బస్టాండు సెంటర్లో అంబేద్కర్‌ విగ్రహానికి హోంమంత్రి డాక్టర్‌ తానేటి వనిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని అన్నారు. అలాగే 4వ వార్డులో అంబేద్కర్‌ విగ్రహాం వద్ద జరిగిన కార్యక్రమంలో మాలమహాసభ జాతీయ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ బొంతా శ్యామ్‌ రవి ప్రకాష్‌, దళిత నాయకులు పెనుమాక జయరాజు, ప్రభాకర్‌ బొంతా కిషోర్‌, ముకురపు రామకృష్ణ, జి.చెన్నయ్య, పురుషోత్తం, చిన్న, పులిదిండిరాజా, పాతాల చిన్నబులు, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు. రాజానగరం నన్నయ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ పీఠీకను విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులచే చదివింప చేశారు. ఈ కార్యక్రమంలో విసి ఆచార్య పద్మరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క ఔన్నాత్యాన్ని, రాజ్యాంగ రచనకు కృషి చేసిన రాజ్యాంగరుపకర్తలను కొనియాడారు. ఉండ్రాజవరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి పాల్గొని భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జివిఎస్‌ఆర్‌కె రాజు, గ్రామ సర్పంచ్‌ బొక్కా శ్రీనివాస్‌, సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.కడియం మండలంలోని మురమండ అంబేద్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ అయినవల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు, ఎంపిటిసి మెల్లిమి మంగా గంగరాజు, గారపాటి బుజ్జిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పల్లి ప్రసాద్‌, పైడిమళ్ళ శాంతకుమారి, కొప్పాక రమణ, బిళ్ళకుర్తి గంగాజలం, యండమూరి ముత్యాలరావు పాల్గొన్నారు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ టి.రాధిక, ఎఎస్‌ఒ జోడాల వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి జొన్నకూటి పోసిరాజు, సర్పంచ్‌ డాక్టర్‌ గండి రాంబాబు, యాళ్ళ బాబూరావు, తదితరులు అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతానగరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వివిధ పోటీలు నిర్వహించి, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల స్టాఫ్‌ సెక్రటరీ కె. సతీష్‌ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హెచ్‌ఎ ఎం. వీరభద్ర రావు పాల్గొన్నారు. ఎంపిపి పాఠశాలలో బొల్లాప్రగడ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పిడి సింహాద్రి, శంకర్‌లు, ఉపాధ్యాయులు తమ్మయ్య, రాజేశ్వరి, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. దేవరపల్లి స్థానికంగా వైసిపి ఆధ్వర్యంలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. దేశానికి దిశా దశ చూపిన ఏకైక మహనీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కుప్పల దుర్గారావు, ఎఎంసి ఛైర్మన్‌ గన్నమని జనార్దన్‌ రావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెరవలి స్థానిక మండల పరిషత్‌ పరిషత్‌, తహశీల్దార్‌ కార్యాలయాల్లోనూ, బిఎస్‌పి ఆధ్వర్యంలో పెరవలి సెంటర్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కేంద్రాల్లో ఎంపిపి కార్చెర్ల సీతారామ ప్రసాద్‌, డిప్యూటీ తహశీల్దార్‌ కనకదుర్గ, బిఎస్‌పి నాయకులు గుమమపు చిత్రచేను, బద్దా జాన్‌, చల్లాబత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. గోపాలపురం మండలంలోని కరగపాడు, బుచ్చియ్యపాలెం గ్రామాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్‌ దొడ్డిగర్ల సువర్ణరాజు పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బొమ్మిన నాగలక్ష్మి, నాగరాజు, మాజీ సర్పంచ్‌ సుబ్రహ్మణ్యం, రామారావు, సుందర బాబు, లాజరు నవీన్‌, తదితరులు పాల్గొన్నారు. గోకవరం మండల కేంద్రమైన గోకవరంలో వైసిపి ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు బిజ్జి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వరసాల ప్రసాద్‌, సుంకర వీరబాబు, కర్రీ సూరా రెడ్డి, మచ్చ మోహన్‌, గోలి చిన్ని, మండపాక సతీష్‌, నాగేశ్వరరావు, గాడ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️