లోకేష్‌కు ఘన స్వాగతం

Nov 26,2023 23:10
లోకేష్‌కు రాజమహేంద్రవరంలో

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

హైదరాబాద్‌ నుంచి మధురపూడి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రాజమహేంద్రవరం నగరంలోని క్వారీ సెంటర్‌ మీదుగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలుకు బయలు దేరిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. మధురపూడి విమానాశ్రయంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, టిడిపి నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, రాజానగరం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ బొడ్డు వెంకట రమణ చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా నగరంలోని క్వారీ మార్కెట్‌ సెంటర్‌కు చేరుకున్న లోకేష్‌కు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

 

➡️