శాశ్వత పట్టాలిచ్చే వరకూ పోరాటం

శాశ్వత పట్టాలిచ్చే వరకూ పోరాటంప్రజాశక్తి – నాయుడుపేట మాచవరం గ్రామం దళితులకు శాశ్వత పట్టాలిచ్చేంత వరకూ భూపోరాటం కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు హెచ్చరించారు. మంగళవారం రాత్రి నాయుడుపేట సుందరరామిరెడ్డి భవన్‌లో భూ సమస్యపై జనరల్‌బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వి.నాగరాజు మాట్లాడుతూ దళితులకు గత ప్రభుత్వం సర్వే నంబర్‌ 207లో సాగు పట్టాలు ఇచ్చిందని, అయితే దళితులు ఆ భూములను సాగు చేసుకుంటుంటే ప్రభుత్వ అధికారులు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. శాశ్వత పట్టాలిచ్చేంత వరకూ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌.ముకుంద, వడ్డేపల్లి చెంగయ్య, పద్మావతి, చంద్రకళ, పుట్టయ్య, మాచవరం గ్రామస్తులు పాల్గొన్నారు. మాచవరం భూబాధితులతో సమావేశం

➡️