భారీగా సొంతూర్లకు ఓటర్లు

May 12,2024 23:59

ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ : నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాల్లోని మాచర్లకు చెందిన వారంతా ఆదివారం భారీగా తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తరలిరావడం ఇరు పార్టీలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతోంది. ఇతర ప్రాంతాల నుండి సొంతూళ్లకు వచ్చే ఓటర్లకు ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోర్డర్‌ చెక్‌పోస్టు ద్వారా వచ్చిపోయే వాహనాలను, బస్సులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. పటిష్ట నిఘా ఉంచారు.

➡️