లారీ ఢీకొని విద్యార్థి మృతి

Feb 15,2024 16:58 #Konaseema, #road acident

ప్రజాశక్తి-మండపేట(అంబేద్కర్ కోనసీమ) : మెహర్ బాబా ఆశ్రమ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం కపిలేశ్వరపురం మండలంలోని అంగర గ్రామానికి చెందిన పడాల అఖిల్  పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. గురువారం మోటార్ సైకిల్ పై మండపేట నుండి ద్వారపూడి వైపు వెళ్తుండగా మెహర్ బాబా ఆశ్రమం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అఖిల్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.  రామచంద్రపురం డిఎస్పి రామకృష్ణ, టౌన్ సీఐ అఖిల్ జామలు పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️