కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి

మాట్లాడతున్న కాంగ్రెస్‌ నేతలు

ప్రజాశక్తి- చింతపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు, పాడేరు నియోజకవర్గం ఇన్చార్జ్‌ వంతల సుబ్బారావు తెలిపారు. మండలంలోని గొందిపాకల పంచాయతీ తోటమామిడిలో కాంగ్రెస్‌ పార్టీ సమావేశం మండల అధ్యక్షుడు లకె వెంకటరమణ అధ్యక్షతన జరిగిన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద ఆదివాసి గిరిజన తెగకు చెందిన తనను గుర్తించి పాడేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా టిక్కెట్టు కేటాయించడం సంతోషకరమన్నారు. అట్టడుగున ఉన్న పీవీటిజి తెగకు చెందిన తనను జాతీయ పార్టీ గుర్తించడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఆదివాసి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతల గోపీనాథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాటి వీరన్న పడాల్‌ (బాబులు), బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సాగిన కృష్ణ పడాల్‌, ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్రా సూరిబాబు పాడేరు పట్టణ అధ్యక్షుడు కూడా బాలకృష్ణ, శ్రీనుబాబు, సింహాద్రి పాల్గొన్నారు.

➡️