సిహెచ్‌డబ్ల్యుల సమస్యలపై పోరాటం

మాట్లాడుతున్న ప్రభావతి

 

పజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా పరిధిలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న సిహెచ్‌డబ్ల్యులను ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశ వర్కర్లుగా మార్చాలని, గత ఆరు రోజులుగా పాడేరు ఐటిడి ఎదురుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం ఏడవ రోజు కొనసాగాయి. ప్రభుత్వం స్పందించి సిహెచ్డబ్ల్యులను ఆశ వర్కర్లుగా మార్చకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, పాడేరు ఏజెన్సీలో ఉన్న 750 మంది ఆశ వర్కర్లు నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి తెలిపారు. దీక్షా శిబిరానికి గురువారం వచ్చి సంఘీభావం తెలియ చేశారు… ఒకే పని విధానం కలిగివున్న సిహెచ్‌బ్ల్యులను ఆశ వర్కర్లుగా మారుస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని ఈ మేరకు కచ్చితంగా మార్చాలన్నారు. సిహెచ్‌ డబ్ల్యు నెలకు కేవలం రూ.4000 రూపాయలతోటే జీవితం గడపడం అన్నది చాలా దారుణమైన విషయమన్నారు. సిహెచ్డబ్ల్యులను ఆశ వర్కర్లుగా మార్చాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. సిహెచ్‌ డబ్ల్యు నిరాహార దీక్ష చేస్తుండటంతో గ్రామాల్లో ప్రజానీకానికి వైద్యారోగ సేవలు క్షేత్రస్థాయిలో అందలేదని అధికారులు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సిహెచ్డబ్ల్యుల పోరాటం సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉంటుందని, ఐద్వా తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళ సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శిలు జయ, కౌసల్య, హైమా, ఆశ వర్కర్లు మంగమ్మ, కమ్యూనిటి వర్కర్స్‌ కె.పార్వతమ్మ, కాంతమ్మ, చిన్ని, సావిత్రీ, మొద కొండమ్మ పాల్గొన్నారు.

➡️