‘ఉపాధి’ కల్పనలో రాజవొమ్మంగి మొదటి స్థానం

ఎంపీడీవో యాదగిరిశ్వరావు 
ప్రజాశక్తి-రాజవొమ్మంగి :  రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయితీలలో ఉపాధి పనులు కల్పించడంలో రాజవొమ్మంగి మండలం అల్లూరి జిల్లాలో వరసగా రెండవ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచిందని స్థానిక ఎంపీడీవో లోకలు యాదగిరి శ్వరరావు శనివారం తెలిపారు,ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి సిబ్బందితో ఎంపీడీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందికి పలు సూచనలు చేశారు, మండలంలో 8,400 కుటుంబాలు జాబు కార్డులు కలిగి ఉండగా,అందులో ఇప్పటికే సుమారు 3000 కుటుంబాలకు పైబడి వంద రోజులు పని కల్పించడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం చరిత్రలో మండలంలో మొదటిసారిగా 6,54,047 పని దినాలు మార్చి నెలాఖరు నాటికి సాధించడం జరిగిందని తెలిపారు. ఏడాదికి సగటున 77.48 రోజులు పనులు కల్పించినట్లు తెలిపారు, కూలీలకు రూ 241సగటు వేతనం ఉపాధి కూలీలకు ఈ ఏడాది15.84 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. మెటీరియల్ రూపంలో రూ2.97కోట్లు చెల్లించడం జరిగిందన్నారు, 2023.24 వార్షిక ఏడాదిలో కూడా ఉపాధి హామీ పనులు అమల్లో అల్లూరి జిల్లాలో రాజవొమ్మంగి మొదటి స్థానం కైవసం చేసుకున్నందుకు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది కూడా లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఉపాధి పనుల్లో ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ సురేష్ కుమార్, పలువురు ఉపాధి కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు.

➡️