మాజీ ఎమ్మెల్యే కుంజా బుజ్జికి ఘన నివాళి

ప్రజాశక్తి-విఆర్ పురం : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బజ్జి మూడవ వర్ధంతిని మండలంలోని ఆయన స్వగ్రామమైన అడవి వెంకన్నగూడెంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయన స్తూపం ఏర్పాటు చేసిన చిత్రపటానికి సిపిఎం మండల కమిటీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ ఆదర్శ ప్రాయుడు. ఏజన్సీ ముద్దు బిడ్డ ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తీ కామ్రేడ్ బొజ్జి గారికి జోహార్.లు అర్పించారు. బొజ్జి కుమారులు నాగిరెడ్డి జానకిరావు, మనవళ్ళు చాలా సాధారణంగా జీవిస్తున్నారు. బొజ్జి రాజకీయ ప్రస్థానం బొజ్జి మూడు సార్లు ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నిక అయ్యారని అన్నారు. గ్రామ స్థాయి సర్పంచ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని గుర్తు చేసారు. చట్టసభలోగిరిజన హక్కుల కోసం చట్టాల రక్షణ కోసం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. కుంజ. బుజ్జి ఎంతోమందికి స్ఫూర్తి.ఎంతోమంది మేధావులును నాయకులను కార్యకర్తలను తయారు చేసిన ధీశాలినిస్వార్థంగా నిష్కల్మషంగా అలుపెరగని పోరాటం చేసిన కుంజా. బోజ్జి స్ఫూర్తితో నాయకులు కార్యకర్తలు పనిచేయాలని సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి నీ గెలిపించాలని బుజ్జి లాగే కష్టపడి పనిచేసి మన హక్కులను ఆయన ఆశయాలను సాధించుకోవాల్సిన అవసరం యువతపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు కార్యకర్తలు కుటుంబీకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️