9 రాష్ట్రాల్లో పోటెత్తిన ఓటింగ్

May 13,2024 12:08 #vote

నాలుగో దశలో కీలకంగా ఓటర్లు
2024 లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సోమవారం ఉదయం నుంచి పోటెత్తింది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటికే ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి మరీ ఓట్లు వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్జండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానానికి కూడా ఓటింగ్‌ వేసింది ఓటర్లు బారులు తీరే ఉన్నారు. 99 పార్లమెంట్‌లకు 4264 మంది పోటీ లోక్‌సభ నాలుగవ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తెలంగాణ (1,488) నుంచి అత్యధికంగానూ, ఆంధ్రప్రదేశ్‌లో 25 నియోజకవర్గాల నుంచి 1,103 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్‌ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లు ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. ఆగస్టు 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్‌లో ఇది మొదటి ప్రధాన ఎన్నికలు.నాలుగో దశలో కన్నౌజ్‌ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, కేంద్ర మంత్రులు గిరిరాజ్‌ సింగ్‌ (బెగుసరారు, బీహార్‌), నిత్యానంద్‌ రారు (ఉజియార్‌పూర్‌, బీహార్‌), రావుసాహెబ్‌ దాన్వే (జల్నా, మహారాష్ట్ర ఉన్నారు. మహారాష్ట్రలోని బీజేపీకి చెందిన పంకజా ముండేతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌లో కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరి, తఅణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ విజయం కోసం పోటీ పడుతున్నారు. నాలుగో దశలో పోలింగ్‌ జరగనున్న పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, పోలింగ్‌ రోజున ఈ ప్రాంతాల్లో వేడిగాలులు వీచే పరిస్థితులు ఉండవని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి మూడు దశల్లో ఓటింగ్‌ శాతం వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65.68 శాతంగా నమోదైంది. నాలుగో దశలో ఎంత నమోదవుతుందో వేచిచూడాల్సిందే.

➡️