స్టడీ మెటీరియల్‌ పంపిణీ

పంపిణీ చేస్తున్న ట్రస్టు ఛైర్మన్‌ సురేష్‌

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:నాతవరం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ విద్యార్దినులకు పదో తరగతి స్టడీ మెటీరియల్‌ను అల్లాడ జగన్నాథరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ అల్లాడ సురేష్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఉద్యోగాల్లో స్థిరపడ్డాక సేవ చేయాలన్నారు ఆర్థికంగా ఇబ్బంది పడితే తమకు తెలియజేస్తే సహకారం అందిస్తామన్నార. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వూడి చక్రవర్తి, హరి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత పంచాడ హరినాథ్‌, మంగళ భాస్కర్‌, బల్ల అశోక్‌, చిక్కాల శ్రీను, ఉపాధ్యాయులు, హాస్టల్‌ వార్డెన్‌ కె.నూకరత్నం పాల్గొన్నారు.

➡️