55 బైక్స్ స్వాధీనం

May 24,2024 11:02 #anakapalle district

ప్రజాశక్తి-దేవరాపల్లి : మండల కేంద్రం దేవరాపల్లిలో పోలీసులు కార్డెన్ సర్చ్ కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక దాడులు నిర్వహించి ఎటువంటి రికార్డులు లేని 55 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు శుక్రవారం స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కె.కోటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ వాహనాలకు సంబంధించిన రికార్డులను చూపించి వాహన యజమానులు తమ వాహనాలను తీసుకువెళ్లవచ్చని ఎస్ఐ.డి.నాగేంద్ర తెలిపారు. సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో పాటు అధిక సంఖ్యలో పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేశారు. రికార్డులు లేని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ నాగేంద్ర తెలిపారు.

➡️