వైసిపి పతనం ఖాయం : కాలవ

వైసిపి పతనం ఖాయం : కాలవ

చేనేతలతో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

ప్రజాశక్తి-రాయదుర్గం

రానున్న ఎన్నికల్లో వైసిపి పతనం ఖాయమని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. సోమవారం పట్టణంలోని 7, 8వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి చేనేత వర్గానికి చెందిన ముఖ్యులను కలిశారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారన్నారు. తాను నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా అన్నివర్గాల ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో సర్వనాశనమైన రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం, మళ్లీ చంద్రబాబును గెలిపించడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఇందుకు చేనేతలు స్పందిస్తూ రాయదుర్గంలో తనను గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తామని చేనేతలు స్పష్టం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్‌ఛార్జి శివ, మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జ్యోతి, రాష్ట్ర కుర్ని సాధికారిత కన్వీనర్‌ హనుమంతు, జనసేన ఇన్‌ఛార్జి మంజునాథగౌడ్‌, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మండల కన్వీనర్‌ హనుమంతురెడ్డి, బిసి సెల్‌ అధ్యక్షుడు తిప్పయ్య, మల్లి, నాగరాజు, మాజీ వైస్‌ఛైర్మన్‌ మహబూబ్‌ బాషా, తదితరులు పాల్గొన్నారు.

➡️