క్యాన్సర్‌పై అప్రమత్తంగా ఉండాలి

వైద్య సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ చంద్రకళ

       అనంతపురం అర్బన్‌ : క్యాన్సర్‌ వ్యాధిపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో శనివారం నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ భ్రమరాంబదేవి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా మెడికల్‌ కళాశాలలోని ఎస్‌పిఎంలు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గైనికో డాక్టర్‌ చంద్రకళ మాట్లాడుతూ క్యాన్సర్‌ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గర్భకోశ ముఖద్వార, రోమ్ము, నోటి క్యాన్సర్లపై స్పెషలిస్ట్‌ డాక్టర్లు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమం తర్వాత గ్రామాల్లో 30 సంవత్సరాలు పైబడిన మహిళలను పరీక్షించాలన్నారు. అనుమానాస్పద మహిళలను గుర్తించి స్పెషలిస్ట్‌ డాక్టర్ల వద్దకు చికిత్స నిమిత్తం పంపనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, పీహెచ్సీల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️