ఆదరిస్తే గండికోట నుంచి నీరు తెస్తాం..

ఆదరిస్తే గండికోట నుంచి నీరు తెస్తాం..

మహిళతో మాట్లాడుతున్న బండారు శ్రావణిశ్రీ

ప్రజాశక్తి-పుట్లూరు

వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే గండికోట నుంచి నీరు తీసుకొచ్చి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ హామీ ఇచ్చారు. మంగళవారం మండల పరిధిలోని గరుగుచింతలపల్లి, కోమటికుంట్ల, పుట్లూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గరుగుచింతలపల్లి, కోమటికుంట్ల, పుట్లూరు గ్రామాలు నీటిఎద్దడితో విలవిలలాడుతున్నాయ న్నారు. తనను ఆదరిస్తే పుట్లూరు మండలవ్యాప్తంగా నీటి సమస్య లేకుండా తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఐదేళ్ల కాలం నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీరు అందిస్తామని పేపర్లు చూపిస్తూ మభ్యపెట్టారన్నారు. టిడిపి హయాంలోనే గండికోట నుంచి గరుగుచింతలపల్లికి నీరు తెచ్చేందుకు ప్రయత్నాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జెసి పవన్‌కుమార్‌రెడ్డి, ముట్టిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు, జెఆర్‌పేట బాబు, బాలరంగయ్య, కోమటికుంట్ల కులశేఖర్‌రెడ్డి, సుదర్శన్‌నాయుడు, గోవర్ధనరాజు, రాము మునిరెడ్డి, బి.రామచంద్రారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, పుల్లారెడ్డి, శివారెడ్డి, బ్రహ్మయ్య, రంగయ్య, శ్రీనివాసులు నాయుడు, శ్రీనివాస్‌ రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.నార్పల : మండలంలోని తుంపెర గ్రామంలో టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు హాజరై ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. అంతేగాకుండా వచ్చే ఎన్నికల్లో టిడిపిని ఆదరిస్తే అమలు చేయనున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆలం వెంకట నరసానాయుడు, పిట్టు రంగారెడ్డి, ఎర్రినాగప్ప, ఆలం నాగర్జుననాయుడు పాల్గొన్నారు.

➡️