త్రాగునీటి సమస్య పరిష్కరించండి : ఎంపీపీ

Feb 5,2024 15:28 #Anantapuram District

ప్రజాశక్తి-పుట్లూరు : గ్రామాలలో త్రాగునీటి సమస్య ఏర్పడుతుందని వెంటనే వాటిని పరిష్కరించాలని ఎంపీపీ రాఘవరెడ్డి అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ వర్షాలు తక్కువ ఉండడంతో గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి నెలకొంటుందని ముందస్తు చర్యలో భాగంగా గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారి రామలింగారెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ వారి పరిధిలో నిర్వహిస్తున్న పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దస్తగిరి, ఈవో ఆర్ డి అనంత ప్రసాద్, డిటి మల్లేష్ ప్రసాద్, మండలం ఇంజనీర్, ఏవో కాత్యాయని, వైద్యాధికారి శ్రీవాణి, ఎంఈఓ లు శ్రీదేవి, ప్రేమ్ కుమార్, ఏటీఎం వెంకట్రామిరెడ్డి, ఏపీవో చెన్నకేశవులు, ఎంపీటీసీలు సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

➡️