విద్యార్థులకు ట్యాబుల పంపిణి 

Jan 19,2024 15:13 #Annamayya district
tabs distribution

ప్రజాశక్తి-కలకడ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనలో 8వ తరగతి విద్యార్థులకు సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు మోడెమ్ చెంగల రాముడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు ట్యాబులను సద్వినియోగం చేసుకొని మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలని సూచించారు. టాబులలో విలువైన సమాచారం ఉందని దానిని మాత్రమే చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సరళమ్మ, మధుసూదన్ రెడ్డి, కమిటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు శివారెడ్డి, కిరణ్ కుమార్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡️